Tuesday, August 5, 2025

సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు బెయిల్ విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆయన్ను అరెస్ట్ చేయకుండా కల్పించిన స్పెషల్ రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా మరోవైపు సిట్ అధికారుల విచారణ పేరుతో వేధిస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ల విచారణలో భాగంగా కేసు స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిధ్దార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి నివేదించారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తైయ్యే వరకు ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి కల్పించిన మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News