Friday, August 8, 2025

హిందీలోనూ డబ్బింగ్

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Tandavam’) కోసం నాలుగవ సారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సీక్వెల్ మూవీ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుందని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. గురువారం తో ’అఖండ-2’ డబ్బింగ్ పూర్తయింది.

మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా సీజన్‌లో జనం ముందుకు రానుంది. బాలయ్య హిందీ డబ్బింగ్ కూడా తానే చెప్పనున్నట్టు తెలిసింది. త్వరలోనే హిందీ డబ్బింగ్(Hindi dubbing coming) ప్రారంభించనున్నారు. గతంలో భగవంత్ కేసరి సినిమాకి బాలయ్య హిందీ డబ్బింగ్ చెప్తే దానికి నార్త్ ఆడియెన్స్‌లో కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అఖండ 2 కి అంతకు మించిన స్పందన ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News