Friday, September 19, 2025

కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

విజయవాడ: కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి 3.30కి అమరావతి సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అమరావతి రాజధాని పునర్‌నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అమరావతి పునర్‌ నిర్మాణానికి సూచికగా ‘A’ ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జనం అన్ని జిల్లాల నుంచి అమరావతికి భారీగా తరలివస్తున్నారు. దీంతో అమరావతికి వచ్చే అన్ని మార్గాల్లో రద్దీగా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News