Thursday, May 2, 2024

కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్‌షో నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఈ కీలక దక్షిణాది రాష్ట్రంపై బిజెపి తరఫున ప్రధాని దృష్టి సారించినట్లు ఇప్పుడు ఆయన కేరళ పర్యటనలో తలపెట్టిన కార్యక్రమాలతో వెల్లడైంది. వందేభారత్ రైలుకు ప్రారంభం, డిజిటల్ పార్క్ , పలు చోట్ల రోడ్‌షోల వంటి వాటితో మోడీ కేరళ పర్యటన సాగుతుంది. ప్రధాని మోడీ చుట్టూ భద్రతా వలయం ఉండగా కొచ్చిలో రోడ్లపై పాదయాత్రకు దిగారు. ఇరు వైపులా నిలబడి కేరింతలు కొడుతున్న వారికి అభివాదాలు తెలియచేస్తూ సాగారు. ఇంతకు ముందు కేరళకు ఎప్పుడు వచ్చినా ఓపెన్‌టాప్ వాహనంలో ఊరేగే మోడీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు పాదయాత్రకు దిగారు. సంప్రదాయక కేరళ దుస్తులు కసవూ ముండూ లుంగీ, శాలువా, కుర్తా ధరించి స్థానికులను ఆకట్టుకునేందుకు యత్నించారు. సాయంత్రం ఐదుగంటలకు ప్రత్యేక విమానంలో మోడీ ఇక్కడి ఐఎన్‌ఎస్ నౌకా వైమానిక స్థావరం వద్ద దిగారు.

అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల మేర ముందుకు సాగుతూ యువజన సమ్మేళనం జరిగే వేదిక వద్దకు చేరారు. 15 నిమిషాల పాటు నడకసాగించిన మోడీ ఆ తరువాత ప్రత్యేక ఎస్‌యువి వాహనంలో వెళ్లారు. తరువాత యువమ్ 2023 సదస్సులో ప్రసంగించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వం కేరళను దృష్టిలో పెట్టుకుని పలు భారీ స్థాయి మౌలిక సాధనాసంపత్తుల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిందని, వీటితో కీలక స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇంతకు ముందటి వరకూ భారతదేశం బలహీన ఆర్థిక వ్యవస్థతో ఉండేదని, ఇప్పుడు వేగవంత పురోగామ ఆర్థిక శక్తిగా మారిందన్నారు. యువత ప్రమేయంతోనే ఇది సాధ్యం అయిందని తెలిపిన మోడీ తాను దేశంలోని యువతపై ఎక్కువగా నమ్మకాలు పెట్టుకున్నానని చెప్పారు. యువజన కార్యక్రమాల విస్తృత అమలుతో కేరళ రాజకీయాలలో భారీ స్థాయిలో మార్పులు వస్తాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News