Thursday, May 2, 2024

క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో…

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్నారు. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ని ప్రకటించారు నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించనుంది. ఇది ప్రియా భవానీ శంకర్ తొలి తెలుగు చిత్రం కానుంది. ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తిరుతో సహా మరికొన్ని తమిళ చిత్రాలలో ఆమె నటించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుండబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్.

Priya Bhavani Shankar telugu debut movie with Satya Dev

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News