Monday, November 4, 2024

ప్రకాశ్ రాజ్ పై నిర్మాత వినోద్ కుమార్ అసహనం

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటుడు ప్రకాశ్ రాజ్ పై ‘మార్క్ ఆంటోని’ సినీ నిర్మాత వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన తీరు వల్ల తనకు కోటి రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

చెన్నైలో ఎంపీ తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. దీనికి ముఖ్యమంత్రి స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. కాగా దీనిపై నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు.

‘‘నీ పక్కన కూర్చొన్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారు. నువ్వు అయితే డిపాజిట్ కూడా కోల్పోయావు. అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసం. ఓ సినిమా సెట్ లో మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా కారవాన్ లో ఎక్కడికో వెళ్లిపోయావు. కోటి రూపాయల నష్టం వాటిల్లేలా చేశావు. అలా చేయడానికి కారణం ఏమిటి? #జస్ట్ ఆస్కింగ్!!! కాల్ చేసి జరిగింది వివరిస్తానని అన్నావు. కానీ నువ్వసలు ఫోనే చేయలేదు!!’’ అని ఆ నిర్మాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏ సినిమా విషయంలో ఇలా జరిగిందన్నది ఆ నిర్మాత పేర్కొనలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News