Friday, May 3, 2024

వరద బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : మొరంచపల్లి వరద బాధితులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేసి తక్షణ సాయం క్రింద ప్రతి ఇంటికి రూ. 1లక్ష అంజేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మేకల సుమన్ మహారాజ్ డిమాండ్ చేశారు. గురువారం భూపాలపల్లి మండలం మొరంచపల్లిలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు వరద బాధితుల పక్షాన రోడ్డుపై ధర్నాలో బైఠాయించి భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు పేదలపై ఎలాంటి ప్రేమ లేదని ఆయన నిర్లక్ష్యం వలనే గ్రామంలో ధన, ప్రాణ, ఆస్థి నష్టం సంభంవించిందని విమర్శించారు. గిరిజన అటవీ ప్రాంతాల్లో జనం వరదలతో అతలాకుతలమవుతుంటే బాధితులను పరామర్శించకుండా

వరద ప్రాంతాలను సందర్శించకుండా సిఎం కెసిఆర్ రాజకీయాల కోసం మహారాష్ట్రకు వెళ్ళడం సిగ్గు చేటన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా ఒక లక్ష చెల్లించాలని, ధ్వంసమైన గృహాలను పునర్నిర్మించడానికి ప్రతి కుటుంబానికి రూ.20 నుండి రూ.50లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే మీ న్యాయమైన డిమాండ్స్‌ను నెరవేర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మహారాజ్, నాయకులు కండె రవి, మంద రమేష్, రాజు కుమార్, మొరంచపల్లి బాధితులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News