Sunday, July 21, 2024

రాధాబాయ్‌గా అందాలొలికిస్తూ…

- Advertisement -
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ’తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్‌లో అలరించబోతుంది. తాజాగా మేకర్స్ మన్నారాపై చిత్రీకరించిన రాధాభాయ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. భోలే షావలి ఈ పాటని క్యాచి మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ అందించిన ఈ పాటని శ్రావణ భార్గవి హైలీ ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News