Friday, September 19, 2025

రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ అందుకున్నా: సంజయ్ రనౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుంచి తనకు నిన్న రాత్రి ఫోన్ కాల్ వచ్చిందని, రాజకీయ విద్వేషాల కాలంలో ఇలాంటి సౌహార్దత బహు అరుదు అని  శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సోమవారం చెప్పారు. 110 రోజుల పాటు జైలులో గడిపిన తన గురించి ఆయన అడిగి తెలుసుకున్నారని అన్నారు.  రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సెప్టెంబర్ 7 నుంచే పెద్ద ఎత్తున ప్రజల మమైకంతో కొనసాగుతోందని, రాహుల్‌కు ప్రజల నుంచి ప్రేమ, ఆదరణ, దీవెనలు అందుతున్నాయని రౌత్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News