Thursday, May 2, 2024

బ్యాంకు ఉద్యోగులకు రాహుల్ మద్దతు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi supports bank employees

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం “లాభాలను ప్రైవేటీకరిస్తుందని,  నష్టాన్ని జాతీయం చేస్తుందని ఆయన ఘాటుగా  విమర్శించారు. పిఎస్‌బిలను మోడీ తన మిత్రులకు అమ్మడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని అని గాంధీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మెలో ఉండి నిరసన తెలిపిన బ్యాంకు ఉద్యోగులకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. తాను సమ్మె చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నట్టు రాహుల్ తన  ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల తొమ్మిది యూనియన్ల (పిఎస్‌బి) నేతృత్వంలో  బ్యాంకు ఉద్యోగుల సమ్మె  రెండో రోజు కొనసాగింది.   బ్యాంకులను ప్రైవేటికరిచండం వల్ల నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్ క్లియరెన్సులు, చెల్లింపుల సేవలను పొందడానికి వినియోగదారులు అసౌకర్యానికి గురవుతారని, ఖజానాకు సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలతో పాటు వ్యాపార లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయని రాహుల్ స్పష్టం చేశారు.  Rahul Gandhi supports bank employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News