Friday, May 3, 2024

తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎండాకాలం వాన చినుకులు(సమ్మర్ షవర్స్) పడుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రత చల్లబడింది. గురువారం, శుక్రవారం ఓ మోస్తరు వానలు పడతాయని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ రెండు రోజులు అనేక జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.

హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం  పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మణికొండ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, లక్డికాపూల్‌, మాదాపూర్‌, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, టోలీచౌకిలో భారీ ఉరుములతో కూడిన వర్షం వచ్చింది.

ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రహదారులు జలమయమవ్వడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.గురువారం కొమరం భీమ్‌ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తన డైలీ బులెటిన్‌లో వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కూడా అక్కడక్కడ వడగండ్ల వాన పడొచ్చని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News