Tuesday, August 5, 2025

తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏడవ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణ్రోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయం పూట ఎండ, మేఘాలతో వాతావరణం ఉంటుందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండొచ్చనిహెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News