Monday, February 26, 2024

మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains likely in Telangana for next 2 days

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. రెండు రోజులుగా కాస్త విరామం ఇచ్చిన వరుణుడు మరోసారి ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు పలు చోట్ల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురంభీం, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains likely in Telangana for next 2 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News