మన తెలంగాణ/హైదరాబాద్: రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని వికారాబాద్, సంగరెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా మరో మూడు రోజులు సైతం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా మంగళవారం అత్యధికంగా హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో 115.6 మిల్లీమీటర్లు, షేక్‌పేటలో 105.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -