- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ముంబయి ఓపెనర్లు మంచి ఆరంభం అందింయారు. మొదటి వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రియాన్ రిక్లిటన్(61;38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు),రోహిత్ శర్మ(53;36 బంతుల్లో 9 ఫోర్లు) పరుగులు చేశారు. సూర్య కుమార్ యాదవ్(48; 23 బంతుల్లో ఫోర్లు,3 సిక్స్ లు), హార్థిక్ పాండ్యా(48; 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ) నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్ , తీక్షణ చెరో వికెట్ తీశారు.
- Advertisement -