Friday, April 26, 2024

ఆస్ట్రాలజర్‌గా రెజీనా!

- Advertisement -
- Advertisement -

Regina

 

అందాల తార రెజీనా కొంతకాలంగా తెలుగులో భిన్నమైన సినిమాలే చేస్తోంది. అ..!, సెవెన్, ఎవరు లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఈ సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి పేరే దక్కింది. అందుకే ఇకపై కూడా అలాంటి చిత్రాలే చేయనుంది ఈ భామ. తమిళ దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్షన్‌లో ఒక కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో రెజీనా ఒక కీలక పాత్ర చేయనుంది. ఈ చిత్రంలో ఆమె ఆస్ట్రాలజర్‌గా నటించనుందట. ఇందులో మనుషుల భవిష్యత్ చెప్పే ప్రత్యేకమైన యువతిగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర మీద, సినిమా మీద రెజీనాకు చాలా నమ్మకంగా ఉందట. జనవరి రెండో వారం నుండి చెన్నైలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Regina as Astrologer
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News