Tuesday, April 30, 2024

జిఒ 59 కింద క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిఒ 59 కిం ద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ జారీ చేయడంపై సిసిఎల్‌ఏ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి సర్యులర్ 2023, తేదీ 21.02.23 సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం జారీ చేశారు. యూ ఎల్‌సి చట్టం కింద అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి, మిగులు భూమి కబ్జాలో ఉన్న వారికి ప్రభుత్వం జిఒ 59 కింద ఈ కన్వేయన్స్ డీడ్ ను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తుదారులు మార్కెట్ ప్రకారం మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కన్వేయన్స్ డీడ్‌లు లబ్ధిదారునికి జారీ చేయాలని నవీన్‌మిట్టల్ ఈ స ర్కులర్‌లో పేర్కొన్నారు. కన్వేయన్స్ డీడ్ జా రీకి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పా ట్లు చేయాలని, డీడ్ జారీ విషయంలో సంబంధిత తహసీల్దార్ మీసేవ వెబ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలని ఆయన పేర్కొన్నారు.

అప్లికేషన్ ప్రాసెసింగ్ మెనూలో జిఒ 59 డీడ్ ఆఫ్ కన్వేయన్స్‌ను తహసీల్దార్ ఎంపిక చేసుకోవాలని, దీనికి తహసీల్దార్ పూర్తి బాధ్యత అని ప్రభు త్వం తెలిపింది. తహసీల్దార్ బయోమెట్రిక్ అ థెంటికేషన్‌తోనే కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయాలని, డౌన్‌లోడ్ చేయడానికి ముందు తహశీల్దార్ వివరాలను క్రాస్ చెక్ చేసుకోవాలని నవీన్‌మిట్టల్ ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ద రఖాస్తును ఆమోదించిన తర్వాత, కన్వేయన్స్ డీడ్ రెడీ అవుతుందని, ప్రింట్ ఔట్ తీసుకున్న తర్వాత, సంబంధిత తహసీల్దార్ కన్వేయన్స్ డీడ్‌పై సంతకం చేయడంతో పాటు కార్యాల యం ముద్ర వేయాలని, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కన్వేయన్స్ డీడ్‌ను ఉచితంగా నమోదు చేసుకోవాలని నవీన్‌మిట్టల్ ఈ మార్గదర్శకాల్లో తెలిపారు.
జిఒ 58, 59 కింద పేదలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో వారు దరఖాస్తు చేసుకున్నారు. 125 చదరపు గజాలలోపు ఇళ్లు కట్టుకున్న వారికి (జిఓ 58 కింద) ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వగా, అంతకుమించిన స్థలాల్లో నిర్మాణాలు చేసిన వారికి (జిఓ 59 కింద) ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోంది.
2022 సంవత్సరంలో 17,660 దరఖాస్తులు
2014 సంవత్సరంలో జిఓ 59 కింద ప్రభుత్వం 17,829 కన్వేయన్స్ డీడ్‌లను జారీ చేసింది. అయితే మరోసారి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు జిఓ 59 దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 21వ తేదీ 2022 నుంచి మార్చి 31, 2022 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి జిఓ 58, 59 కింద 1.68 లక్షల మంది దరఖాస్తులు రాగా, వీరిలో దాదాపు 96 వేల మందికి జిఓ 58 మందికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. మిగతా 72 వేల దరఖాస్తులను జిఓ 59 కింద ప్రభుత్వం పరిశీలించింది. ఈ దరఖాస్తులను స్క్రూటీని చేయగా 54,340 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించిన ప్రభుత్వం 17,660 దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
100 శాతం సొమ్మును ఫీజుగా….
250చ.గజాల్లోపు ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ కనీస ధరలో 50%, 250- నుంచి 500 చ.గజాల స్థలాలకు కనీస ధరలో 100% సొమ్మును ఫీజుగా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణా లు చేసుకున్న వారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. వి స్తీర్ణంతో సంబంధం లేకుండా నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.
నిర్మాణం ఉంటేనే క్రమబద్ధీకరణకు అవకాశం
మీ సేవ ద్వారా జిఓ 59 కింద దరఖాస్తు చేసుకున్నారు. వారు దరఖాస్తు చేసుకున్నప్పుడు గుర్తింపు కార్డు, స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/త్రాగునీటి బిల్లు/రిజిస్ట్రర్ డాక్యుమెంట్ వంటి వాటిలో ఏదైనా ఒక దానిని జత చేశారు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో ఏదో ఒక నిర్మాణం ఉంటేనే క్రమబద్ధీకరిస్తామని ప్రభు త్వం ముందస్తుగా పేర్కొంది. దీంతోపాటు ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూ ములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములకు మాత్రమే క్రమబద్దీకరణలో చోటు కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News