Thursday, May 2, 2024

గ్రూప్ -4 ప్రిలిమినరీ కీ విడుదల

- Advertisement -
- Advertisement -

30 నుంచి వచ్చే నెల 4 వరకు అభ్యంతరాల స్వీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -4 పరీక్ష మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రాథమిక కీ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) విడుదల చేసింది. ప్రాథమిక కీ పై ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్ ద్వారా ఇంగ్లీష్‌లో అభ్యంతరాలను సమర్పించాలని పేర్కొంది. ఇ మెయిల్ ద్వారా, వ్యక్తిగతంగా సమర్పించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 4కు హాజరైన 7,63,835 పేపర్ 1 ఒఎంఆర్ షీట్లు, 7,61,026 పేపర్ 2 ఒఎంఆర్ డిజిటల్ కాపీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది. వచ్చే నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డిజిటల్ ఒఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. జులై 1న పరీక్ష నిర్వహించగా.. పేపర్ -1కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్ -2 కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
వెబ్‌సైట్‌లో పాలిటెక్నిక్ లెక్చరర్ హాల్ టికెట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. పరీక్షకు 45 నిమిషాల ముందు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు త్వరగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News