Saturday, May 11, 2024

14 మంది డుమ్మా టీచర్లపై వేటు

- Advertisement -
- Advertisement -

14teachers

 

హైదరాబాద్ : విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులపై వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 మంది ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీరు కాకుండా మరో 92 మంది ఉపాధ్యాయులపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం కానీ, అనుమతి కానీ లేకుండా ఏకంగా ఐదేళ్ళపాటు విధులకు హాజరుకాని పక్షంలో ఉపాధ్యాయులను సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలున్నాయి. గతంలో కొందరు ఉపాధ్యాయులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరు కావడంతో వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఇదే తరహాలో అనధికారికంగా విధులకు గైర్హాలజరవుతుండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విధుల నుంచి తొలగించిన టీచర్ల వివరాలు
కామారెడ్డి జిల్లా సోమార్‌పర్ జెడ్‌పిహెచ్‌ఎస్ ఇంగ్లీష్ టీచర్ సి.విద్యలత, కందెబుల్లార్ యుపిఎస్‌కు చెందిన ఎస్‌జిటి సన నాజ్, నాగర్‌కర్నూల్ జిల్లా కొర్డువాడ తండా ఎంపిపిఎస్‌కు చెందిన ఎస్‌జిటి ఆర్.మదన్‌మోహన్‌రెడ్డి, అదే జిల్లాకు చెందిన కల్వకుర్తి హన్మానగర్ ఎంపియుపిఎస్ ఎస్‌జిటి సి.అంజమ్మ, తిమ్మాపూర్ ఎంపిపిఎస్‌కు ఎస్‌జిటి అస్మా సుల్తానా, హైదరాబాద్‌కు చెందిన తేగ ఛార్మినార్ జిపిఎస్‌కు చెందిన ఎస్‌జిటి తనియాత్ జహన్, అసిఫాబాద్ జిబిపిఎస్‌కు చెందిన ఎస్‌జిటి వి.కె.శిష్లత, ఖమ్మంకు చెందిన రేపల్లెవాడ యుపిఎస్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ సునిత, కరీంనగర్ ఛమాన్‌పల్లి ఎంపియుఎస్ ఎస్‌జిటి ఎం.విజయలక్ష్మి, అదే జిల్లా కదంపూర్ ఎంపిపిఎస్‌కు చెందిన ఎస్‌జిటి పి.విజయకుమార్, నిర్మల్‌కు చెందిన మస్లంపేట్ ఎంపిపిఎస్ ఎస్‌జిటి ప్రవీణ్‌కుమార్, జగిత్యాల జిల్లాకు చెందిన అమరిపేట్ జెడ్‌పిహెచ్‌ఎస్ సోషల్ టీచర్ అనుగంటి సురేష్, అదే జిల్లాకు చెందిన షేకెల్ల జెడ్‌పిహెచ్‌ఎస్ ఇంగ్లీష్ టీచర్ ప్రభాహాసినిలను విధుల నుంచి తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

Removed of non-attending 14teachers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News