Sunday, April 28, 2024

మున్సిపోల్స్ నోటిఫికేషన్‌పై తాత్కాలిక స్టే

- Advertisement -
- Advertisement -

municipal notification

 

నేటి సాయంత్రం వరకు విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తా త్కాలిక బ్రేక్ ఇచ్చింది. మంగళవారం తాము ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు ఎన్నికల నో టిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌లో నిబంధన లు పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. దీనిని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యా యమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెం చ్ విచారించింది. మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ను పాటించలేదని పిటిషనర్ తరపు సీనియర్ లాయర్ ప్రకాష్‌రెడ్డి
వాదించారు. తొలుత రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాలని, అయితే ము ందుగా ఎలక్షన్ల షెడ్యూల్ ప్రకటించాక రిజర్వేషన్లను ఖరారు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉత్తర్వులివ్వాలన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందువల్ల ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడాన్ని చట్టవిరుద్ధమైనందిగా ప్రకటించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ విడుదల చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. షెడ్యూల్ వెలువడే నాటికి ఓటర్ల లిస్ట్ కూడా రెడీగా లేదన్నారు. షెడ్యూల్ మేరకు 120 మున్సిపాల్టీలు, వాటిలోని 2727 వార్డులు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటిలోని 385 వార్డులకు ఈ నెల 22న ఎలక్షన్లు జరుగుతాయని, నామినేషన్లను 8 నుంచి 10వ వరకూ స్వీకరిస్తారని, మంగళవారమే ఎలక్షన్ నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్ ఇచ్చేస్తుందన్నారు.

జీవో 78లోని రూల్స్‌కు వ్యతిరేకంగా వార్డుల్ని విభజించార న్నారు. ఇదే విధంగా గతంలో చేస్తే హైకోర్టు తప్పు పట్టి మార్గదర్శాకాలిచ్చినా వాటినీ ఇప్పుడు అమలు చేయలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ తరఫు సీనియర్ లాయర్ మోహన్‌రెడ్డి వాదిస్తూ, ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు సిద్దంగానే ఉంటారని, రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఒక్క రోజు మాత్రమే సమయం ఉందని పిటిషనర్ ఆందోళనలో అర్ధం లేదన్నారు. రిజర్వేషన్ వర్గాల వారు పోటీ చేయదల్చిన సీటులో తాను ఫలానా కులమని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే (దానిపై తహసీల్దార్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి) చెల్లుబాటు అవుతుందని, ఆ తర్వాత కుల పత్రం ఇస్తే చాలన్నారు. అంతా మాన్యువల్ మేరకే చేశామన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ. మాన్యువల్ ఎక్కడుందో ఇవ్వాలన్నారు. ఇప్పుడు తన వద్ద లేదని చెప్పగానే విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశించింది.

ఈ కసరత్తు చేయడానికి జనవరి 4 వరకూ గడువు ఉండగా, గత నెల 23న షెడ్యూల్ ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించింది. చట్ట ప్రకా రం సరిగ్గా ఉండాలని, రిజర్వేషన్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్‌కు తగిన సమయం ఇవ్వనట్లుగా ఉంద ని అభిప్రాయపడింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం వరకూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వబోమని ఎలక్షన్ కమిషన్ లాయర్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Temporary stay on municipal notification
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News