Monday, April 29, 2024

శ్రీవారి సేవలో కెటిఆర్ ఫ్యామిలీ

- Advertisement -
- Advertisement -

KTR family

 

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కుటుంబసభ్యులతో కలిసి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుపతి లోని కృష్ణ అతిథిగృహంలో బసచేసిన కెటిఆర్ సోమవారం తెల్లవారు జామున కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కెటిఆర్ కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరహసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. కెటిఆర్‌కు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఆలయ అర్చకులతో కలిసి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆతర్వాత శ్రీవరసిద్ధి వినాయక స్వామికి కెటిఆర్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత మూసిక మండపంలో వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అర్చకులు అందజేశారు.

కెటిఆర్ సతీమణి శైలిమకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి శ్రీవరసిద్ధి వినాయక స్వామి విగ్రహాన్ని ఆలయ మర్యాదలతో బహూకరించారు. అక్కడే ఉన్న వీరాంజనేయ స్వామి,నవగ్రాహాలకు కెటిఆర్ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యులు క్రాంతి కిరణ్, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గణేష్ గుప్తా,మదన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, యాదయ్యతో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు చేసుకున్నారు.

KTR family members worshipd to venkateswara swamy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News