Tuesday, December 6, 2022

రిటైర్డ్ ఏఎస్‌ఐ మదన్‌మోహన్ మృతి

- Advertisement -

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి: రిటైర్డ్ ఏఎస్‌ఐ మదన్‌మోహన్(72)బుధవారం రాత్రి గద్వాల పట్టణం భీంనగర్‌లో తన  నివాసంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ గురువారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభూతి తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మదన్‌మోహన్ తన సర్వీసులో శాంతి భద్రత విషయంలో మెరుగైన విధులు నిర్వహించారని గుర్తుచేశారు. అదే విధంగా మదన్‌ మోహన్ భౌతికకాయానికి ముదిరాజ్ సంఘం నాయకులు, పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మదన్‌మోహన్ రిటైర్మెంట్ తర్వాత తెలుగు ముదిరాజ్ సంఘానికి గౌరవాధ్యక్షులుగా సేవలు అందించారని, ముదిరాజ్ కులంలో పెద్దదిక్కుగా ఉన్న ఆయన మృతి తీరనిలోటు అని అన్నారు. జిల్లా ఎస్పీ వెంటా ఏఎస్‌ఐ దేవరాజ్, జయరాములు, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Related Articles

- Advertisement -

Latest Articles