Thursday, May 2, 2024

దేశంలోనే కొడంగల్‌కు గుర్తింపు తెచ్చే ఎన్నికలు:రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొడంగల్: దేశ ముఖ చిత్రంలో కొడంగల్‌కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలని టిపిసిసి చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు.సోమవారం కొడంగల్ పట్టణంలోని రేవంత్‌రెడ్డి నివాస ప్రాంతంలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ప్రజల ఆశీర్వాదం మీరిచ్చిన బలంతో కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు గుర్తింపు తెచ్చానన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప ఆవకాశం కొడంగల్‌కు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకిచ్చింది కాదని మీదేనని కొడంగల్‌లో ఉండే ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీకు అధ్యక్షుడేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలన్నారు.

ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యే శాసనసభలో కొడంగల్ అభివృద్ధ్ది, విధుల గురించి ఏనాడైనా అడిగిన దాఖలాలు లేవన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలని అన్నారు. గ్రూపులు, గుంపులు కాదని నియోజకవర్గమంతా ఏకం కావాలని కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతామని కూలీపోతే మీ జీవితాలు ఆగమైతాయన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలని, కర్ణాటక పిసిసి ఛీప్ డికే శివకుమార్ కంటే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. గెZలిచిన రెండేళ్లో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లు అందిస్తానన్నారు. ఏడాదిలో మహబూబ్‌నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని అన్నారు. ఈ ప్రాంతం ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తానన్నారు. అండగా నిలబడే మీ ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత నాదినన్నారు.

అట్టహాసంగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు
తెలంగాణ జరుగుతున్న శాసనసభ ఎన్నికలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిపిసిసి చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు పర్వం అట్టహాసంగా జరిగింది. సోమవారం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొడంగల్ పట్టణానికి భారీగా సంఖ్యలో చేరుకున్నారు. కొడంగల్ పట్టణ వ్యాప్తంగా ఎటు చూసినా కాంగ్రెస్ శ్రేణులే, రేవంత్‌రెడ్డి నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వేలాదిమందితో భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, టిపిసిసి సభ్యుడు యూసుఫ్‌లతో కలిసి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్‌కు అందజేశారు.

రేవంత్ ఆస్తులు రూ. 28.76 కోట్లు
రూ.1.30 కోట్ల అప్పులు, 89 కేసులు
ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రేవంత్‌రెడ్డి అయన కుటుంబ సభ్యులకు ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ. 28,76,62,144. కాగా ఇందులో చరాస్తుల విలువ రూ. 5,11,61352, స్థిరాస్తుల విలువ 23,65,00792గా పేర్కొన్నారు. ఆయన పేరు మీద రెండు కార్లు (2014 హోండా సిటి, 2020 బెంజ్) ఉన్నట్లు ప్రకటించారు. రేవంత్‌కు ఉన్న అప్పులు రూ. 1,30,19,901. అలాగే ఉమ్మడిగా, వారసత్వంగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్‌లలో అయనపై 89 కేసులు నమోదైనట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News