Tuesday, May 21, 2024

ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ను ప్రకటించిన కాంగ్రెస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది. ఈ సభ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ను ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడతూ.. “దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ఏర్పాటు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సి, ఎస్టి డిక్లరేషన్. కెసిఆర్ చేతిలో దళితులు, గిరిజనులు మోసపోయారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తాం. గ్రాడ్యుయేషన్, పిజి చదివే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు వసతి కల్పిస్తాం.

అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సి, ఎస్టి కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సి, ఎస్టిలకు రూ.6లక్షలు ఇస్తాం. పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సి, ఎస్టిలకు మూడు కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు చేస్తాం. ఎస్సి, ఎస్టి విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు ఇస్తాం. గ్రాడ్యుయేషన్, పిజి చదివే ఎస్సి, ఎస్టి విద్యార్థులకు వసతి కల్పిస్తాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News