- Advertisement -
నిర్మల్ జిల్లా, బాసరలో గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో బాసర వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరద నీరు ఆలయ పుర వీధులను ముంచెత్తుతోంది. బాసరలో ఇటీవల జరిగిన వరద బీభత్సాన్ని ప్రజలు మరిచిపోక ముందే గోదావరి మళ్లీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండగా అంతకు తగ్గట్టుగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో బాసర ఆలయ గోదావరి రహదారి బ్యాక్ వాటర్‌తో మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
- Advertisement -