Sunday, September 21, 2025

శంకర్ అంత్యక్రియల్లో భావోద్వేగంతో భార్య డ్యాన్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటుడు, కమెడియన్ రోబో శంకర్(46) (Robo Shankar) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ సెట్‌లో స్పృహ కోల్పోయిన శంకర్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. శంకర్ మృతిపై కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ తదితర సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

అయితే శంకర్ మరణంతో ఆయన (Robo Shankar) భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. సంతాపం తెలిపేందుకు వచ్చిన వాళ్లు ఆమె ఓదార్చారు. అయితే శుక్రవారం శంకర్ అంత్యక్రియల్లో ప్రియాంక డ్యాన్స్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. తన భర్తకు కడసారిగా ఎంతో భావోద్వేగంతో తన డ్యాన్స్‌తో వీడ్కలు పలికింది ప్రియాంక. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత బాధను దిగమింగుకొని డ్యాన్స్‌తో భర్తకు వీడ్కోలు పలకడం చూసి నెటిజన్ల గుండె బరువెక్కింది. ప్రియాంక ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుంతో అంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : నటుడు రోబో శంకర్ ఇకలేరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News