Thursday, May 2, 2024

రాజమౌళి అద్భుతమైన దర్శకుడు

- Advertisement -
- Advertisement -

RRR movie team press meet

‘ఆర్‌ఆర్‌ఆర్’ మొత్తం కల్పితమే: రాజమౌళి
‘భీమ్ పాత్ర కోసం ఎంతో శ్రమించాః తారక్
‘మూడు షేడ్స్‌లో కనిపిస్తాః చరణ్
రాజమౌళి సినిమాలో నటించడం నా కల: అలియా

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రుధిరం రణం). అల్లూరి సీతారామరాజు, – కొమురం భీమ్ వంటి ఇద్దరు మహావీరుల నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. తాజాగా విడుదలైన ఈ భారీ మల్టీస్టారర్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, అలియాభట్, డివివి దానయ్య తదితరులు విలేకరులు అడిగిన పలు పశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఒకే బైక్‌పై వస్తోన్న షాట్‌ని మొదట షూట్ చేశాను. వాళ్ల నటన చూసిన వెంటనే ఈ పెయిర్ ఆన్‌స్క్రీన్‌లో వర్కవుట్ అవుతుందనిపించింది. ఐదు భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నాం. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ కథకు తగ్గట్టు మంచి నటీనటులు దొరకడం నా అదృష్టం.

95 శాతం సినిమా ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో గోండు సామ్రాజ్యం ఉండేది. నిజాం పరిపాలన వల్ల వాళ్ల వర్గం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి వర్గానికి చెందిన ఓ వ్యక్తి నగరానికి వస్తే.. అనే ఆలోచన ఈ సినిమాలో చూపించాను. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు ఒక జన ప్రపంచంలోకి వస్తే.. ఆయన ఎలా ప్రవర్తిస్తాడు… అన్నది చూపించాము. వ్యక్తిత్వాల మీద, పాత్రల మీద మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాము. ఈ సినిమా మొత్తం కల్పితమే. చరిత్రకు సంబంధించిన సంఘటనలు, విషయాలు ఇందులో లేవు”అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం తెలుగు, కన్నడ, హిందీ, తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పాను. మలయాళంలో చెప్పలేదు. అక్కడి నటులతో చెప్పించాం. నిజం చెప్పాలంటే డబ్బింగ్ విషయంలో నాకు ఎక్కడా కష్టం అనిపించలేదు. జక్కన్న ఆవిధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. కొమురంభీమ్ పాత్రలోకి లీనం కావడం కోసం ఎంతో శ్రమించాను. కొమురంభీమ్ గురించి నాకు కొంతవరకు తెలుసు.

కానీ.. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? మెంటల్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక పూర్తిస్థాయి విజన్ ఉంది. అన్ని విషయాల్లో ఆయనే నాకు సాయం చేశారు”అని తెలిపారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఆయన ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఆయన చెప్పినదాన్ని మేము 100 శాతం చేశాం. ఈ సినిమాలో నేను మొత్తం మూడు షేడ్స్‌లో కనిపిస్తాను. మూడూ విభిన్నంగానే ఉంటాయి”అని పేర్కొన్నారు. అలియాభట్ మాట్లాడుతూ “రాజమౌళి సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరడంతో కరోనా సమయంలోనూ షూటింగ్‌కు వెళ్లాను. కరోనా సమయంలో కూడా టీమ్ మొత్తం కష్టపడి పనిచేయడం చూసి నేనెంతో స్ఫూర్తి పొందాను. తారక్, చరణ్ ఇద్దరూ మంచి నటులు. వాళ్లతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మరోసారి అవకాశం వస్తే తప్పకుండా రాజమౌళితో వర్క్ చేయాలని ఉంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News