Home తాజా వార్తలు రెండు కోట్లు విలువ చేసే గంజాయి స్వాధీనం

రెండు కోట్లు విలువ చేసే గంజాయి స్వాధీనం

ganja

హైదరాబాద్: నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రెండు కోట్లు విలువ చేసే గంజాయిని హైదరాబాద్ జోన్ డిఆర్ఐ అధికారులు బృందం పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డిఆర్ఐ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పెద్ద అంబర్ పేట టోల్ ప్లాజా వద్ద ఓ లారీలో తరలిస్తున్న 1,335 కేజిల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా వరి పొట్టును నింపిన లారీలో గంజాయిని తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. నకిలీ నెంబర్ ప్లేట్ తో భద్రాచలం సమీప ప్రాంతం నుంచి గంజాయిని బీదర్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో లారీ డ్రైవర్ తోపాటు అందులో ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

Rs 2 crore ganja seized by DRI officials in Hyd outskirts