Saturday, April 27, 2024

ఎంఎల్‌ఎ మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్రమ నిర్మాణాలపై కొరడా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: మర్రి అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశాలతో అధికారులు కొరడా ఝులిపించారు. సర్వే నంబర్ 405, 482, 484, 488, 492, 506 దుండిగల్ చిన్నదామరచెరువులో మర్రి రాజశేఖర రెడ్డి విద్యాసంస్థల పేరుతో బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టగా ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పోలీస్‌ల బందోబస్తు నడుమ గురువారం ఉదయం 6 గంటల నుంచి నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. 2000 గజాల స్థలంలో నిర్మించిన పక్కా భవనాన్ని రెండు జెసిబిలు, నాలుగు మిషన్లతో గోడలు, స్లాబ్‌లను కూల్చివేశారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపడుతుండగా ఉద యం 10 గంటల సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చి కూల్చివేతలను అడ్డుకొని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వా తావరణం చోటుచేసుకుంది. పోలీస్‌లు ఎంత సర్ది చెప్పినా విద్యార్థులు వినకపోవడతో స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ రంగ ప్రవేశం చేసి విద్యార్థులను పంపించారు. యాజమాన్యం విద్యార్థులను రెచ్చగొట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అనంతరం ర్యాపిడ్ ఫోర్స్ బందోబస్తుతో అధికారులు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.
కోర్టు ఆదేశాలంటూ వెను దిరిగిన అధికారులు
ఉదయం నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన అధికారులు సాయంత్రం 4 గంటల తరువాత కోర్టు ఆదేశాలంటూ వెనుదిరిగినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులను వివరణ కోరగా సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 50 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి 20 సంవత్సరాలుగా కళాశాల భవనాలను నిర్మించుకుంటున్నామని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక్క నోటీస్ అందలేదని గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News