Wednesday, May 15, 2024

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోకి రూ.50 వేల కోట్ల ఎఫ్‌డిఐలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగం గత తొమ్మిదేళ్ల కాలంలో రూ.50,000 కోట్ల విదేశీ పెట్టుబడుల( ఎఫ్‌డిఐ)ను ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పంటల కోత తర్వాతి నష్టాలను, ఆహార వృథాను వీలయినంత మేర తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో దేశ ఫుడ్‌ప్రాసెసింగ్ సామర్థం గణనీయంగా పెరిగిందని, ఫలితంగా శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతిలో 150 శాతం మేర వృద్ధి సాధ్యమయిందని ఆయన చెప్పారు. ఆహార శుద్ధి రంగం సామర్థం కూడా 12 లక్షల టన్నులనుంచి 200 లక్షల టన్నులకు పెరిగిందని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం ప్రారంభమైన రెండవ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌లో ప్రధాని మాట్లాడారు. మూడు రోజలు పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ నెల 5న ముగుస్తుంది. 80కి పైగా దేశాలు, 200 మంది వక్తలు, 12 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, కమోడిటీ బోర్డులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని లక్షకు పైగా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌జిహెచ్)మూలధనం పెట్టుబడి సహాయాన్ని పంపిణీ చేయడంతో పాటుగా ఒక ‘ఫుడ్ స్ట్రీట్’ను ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News