Friday, September 13, 2024

స్వలింగ వివాహాలపై ఆర్‌ఎస్‌ఎస్ సర్వేపై ఎల్‌జిబిటి అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై ఆర్‌ఎస్‌ఎస్ కు చెందిన మహిళా సంస్థ రాష్ట్రీయ సేవిక సమితికి చెందిన సంవర్ధిని న్యాస్ సర్వే చేపట్టడం ప్రమాదకరం, తప్పుతోవ పట్టించడమేనని అనేక ఎల్‌జిబిటిక్యు హక్కుల ఉద్యమ కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ సంస్థ తప్పుడు సమాచారం అందించడానికే అని ఆరోపించారు. ఈ సర్వే ప్రకారం అనేక మంది డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్ స్వలింగ సంపర్కం ఒక రుగ్మత.

అందువల్ల స్వలింగ వివాహం చట్టంగా రూపొందితే ఈ రుగ్మతి సమాజంలో మరింత పెరిగిపోతుందని తమ అభిప్రాయాలు వెల్లడించినట్టు తేలింది. అందువల్ల ఇదేమిటో తెలియని సమాజాన్ని ఈ సర్వే తప్పుదారి పట్టిస్తుందని, ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తుందని, చివరకు పరువు నష్టం వరకు వెళ్తుందని ఎల్‌జిబిటిక్యు హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News