Tuesday, October 15, 2024

2 లారీలను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు లారీలను ఢీకొట్టడంతో ఐదుగురు ప్రయాణికులు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.. మరో 30 మందికి గాయాలయ్యాయి. గురువారం మొగలి ఘాట్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పక్క రోడ్లోకి దూసుకెళ్లి 2 లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News