Thursday, May 2, 2024

ఉక్రెయిన్ అణుకేంద్రం వద్ద రష్యా క్షిపణి దాడి

- Advertisement -
- Advertisement -

Russian missile attack on Ukraine nuclear facility

పుతిన్ హెచ్చరికల నడుమ తీవ్ర చర్య

కీవ్ : తమ దేశ అణు కేంద్రానికి సమీపంలో రష్యా క్షిపణి దాడికి దిగిందని ఉక్రెయిన్ తెలిపింది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలోని పివ్డెన్‌నోయుక్రెయిన్క్ న్యూక్లియర్ ప్లాంట్ లేదా సౌత్ ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్ వద్ద రష్యా క్షిపణి వచ్చిపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అణు కార్యకలాపాల సంబంధిత ఎనర్గోఆటమ్ తెలిపింది. రష్యా చర్యను ఉక్రెయిన్ అణు ఉగ్రవాద చర్యగా పేర్కొంది. అణు కేంద్రంలోని మూడు రియాక్టర్లకు ఎటువంటి నష్టం జరగలేదని, ఇవి క్షిపణి దాడికి గురి కాలేదని పేర్కొన్నారు. అయితే ఇతరత్రా పారిశ్రామిక పరికరాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌లోని పలు భూభాగాలు రష్యా సేనల నుంచి జారిపోవడం , పలు నగరాలలో తిరిగి ఉక్రెయిన్ తన సత్తాను తిరిగి నెలబెట్టుకుంటున్న దశలో రష్యా అధ్యక్షులు పుతిన్ దాడుల ఉధృతికి హెచ్చరికలు వెలువరించారు.

ఈ క్రమంలోనే ఇప్పటి క్షిపణి దాడి జరిగిందని భావిస్తున్నారు. రష్యా సేనలు కీలకమైన ఉక్రెయిన్ సాధనసంపత్తిని, మౌలిక ఆయుధ వ్యవస్థను టార్గెట్‌గా చేసుకుని దాడులు తీవ్రతరం చేస్తుందని పుతిన్ హెచ్చరించారు. అత్యంత కీలకమైన అణుకేంద్రానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే క్షిపణి వచ్చి పడింది. సంబంధిత క్షిపణి ప్రయోగం దృశ్యాలను నలుపు తెలుపు సిసిటివీ ఫుటేజ్‌లలో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఇక్కడ పడ్డ క్షిపణి నుంచి రెండు భారీ స్థాయి అగ్నిగోళాలు బయటకు చొచ్చుకురావడం, అక్కడ ముందు దట్టమైన పొగలు వెలువడటం, నిప్పులు వెదజల్లడం వంటివి కన్పించాయి. ఈ మిస్సైల్ దాడికి సంబంధించి ఇప్పుడు వెలువడ్డ వీడియో 19 నిమిషాల నిడివి దృశ్యాలతో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News