Friday, April 26, 2024

టెన్నిస్‌కు షరపోవా గుడ్‌ బై..

- Advertisement -
- Advertisement -

పారిస్: రష్యా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ మారియా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న షరపోవా టెన్నిస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ కాలం పాటు మహిళా టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిల్లో ఒకరిగా షరపోవా కొనసాగింది. 1987లో జన్మించిన షరపోవా తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఒకవైపు వివాదాలు మరోవైపు వ్యక్తిగత జీవితం షరపోవా కెరీర్‌లో సహవాసం చేశాయి. ఇక, తన కెరీర్‌లో షరపోవా ఐదు సార్లు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది. అంతేగాక ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. దీంతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, అమెరికా ఓపెన్‌లలో టైటిల్స్ సాధించి కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. మరోవైపు లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం కూడా సాధించింది. కాగా, 2001 ప్రొఫెషన్ టెన్నిస్‌కు శ్రీకారం చుట్టిన షరపోవా తన కెరీర్‌లో 36 డబ్లూటిఎ, మరో నాలుగు ఐటిఎఫ్ టైటిల్స్ సొంతం చేసుకుంది.

అంతేగాక 2004లో ప్రతిష్టాత్మకమైన టూర్ ఫైనల్స్ ట్రోఫీని కూడా దక్కించుకుంది. ఇక, కెరీర్‌లో ఐదు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది. 2004లో వింబుల్డన్ ఓపెన్, 2006లో అమెరికా ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను షరపోవా దక్కించుకుంది. అంతేగాక 2012, 2014లలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక, కెరీర్‌లో మొత్తంలో 645 మ్యాచుల్లో విజయం సాధించింది. కేవలం 171 పోటీల్లో మాత్రమే ఓటమి పాలైంది. ఇదిలావుండగా మహిళా టెన్నిస్‌ను శాసించిన కొద్ది మంది స్టార్ క్రీడాకారిణిల్లో షరపోవా ఒకటిగా పేరు తెచ్చుకుంది. చాలా కాలం పాటు మహిళల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగింది. అయితే 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో దోషిగా తేలింది. దీంతో 15 నెలల పాటు నిషేధానికి గురైంది. 2017 ఏప్రిల్‌లో మళ్లీ టెన్నిస్‌కు శ్రీకారం చుట్టింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో షరపోవా పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. కొన్నేళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా ప్రతిష్టాత్మకమైన టైటిల్స్‌ను సాధించడంలో విఫలమైంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో టెన్నిస్ తప్పించు కోవడమే మంచిదనే నిర్ణయానికి రష్యా స్టార్ షరపోవా వచ్చింది. దీంతో బుధవారం రిటైర్మెంట్ గురించి సంచలన ప్రకటన చేసింది. ఇదిలావుండగా మహిళా టెన్నిస్‌లోనే షరపోవా అందలా తారగా పేరు తెచ్చుకుంది. అభిమానులు ఆమెను క్వీన్‌గా పిలుచుకుంటారు.

Russian Tennis Star Sharapova Announced Retirement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News