Friday, May 3, 2024

అది సైనా సొంత నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Saina-Nehwal

బెంగళూరు: గోపీచంద్ అకాడమీని వీడలన్నది సైనా నెహ్వాల్ సొంత నిర్ణయమని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని ప్రకాశ్ పడుకొణె అకాడమీ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అకాడమీ తరఫున ఒక ప్రకటనను విడుదల చేశారు. తమ అకాడమీలో చేరాలన్నది సైనా తనంతట తాను తీసుకున్న నిర్ణయమని, ఇందులో తమ జోక్యం లేదని ఆ ప్రకటనలో వెల్లడించారు.

గోపీచంద్ అకాడమీని విడిచి పెట్టి రావాలని తాము ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలు నిజం కావని అకాడమీ నిర్వాహకులు స్పష్టం చేశారు. సైనా స్వయంగా నిర్ణయం తీసుకుని తమ అకాడమీలో చేరిందనే విషయాన్ని గోపీచంద్ గుర్తుంచుకోవాలని వారు సూచించారు. ఇక, గోపీచంద్ తాను రాసిన పుస్తకంలో సైనాతో పాటు ప్రకాశ్ పడుకొణె అకాడమీపై విమర్శలు గుప్పించాడు. ప్రకాశ్ పడుకొణె అకాడమీ ఒత్తిడి వల్లే సైనా బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించిందని గోపీచంద్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.

Saina Nehwal shifting from Gopichand Academy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News