Monday, April 29, 2024

టోకు ద్రవ్యోల్బణమూ పెరిగింది..

- Advertisement -
- Advertisement -

Wholesale

న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రమే కాదు, టోకు ద్రవ్యోల్బణం కూడా డిసెంబర్‌లో పెరిగింది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్లుపిఐ) డిసెంబర్‌లో 2.59 శాతానికి చేరింది. అంతకుముందు నవంబర్ నెలలో ఇది 0.58 శాతంగానే ఉంది. ఉల్లి, బంగాళదుంప వంటి ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్ల డబ్లుపిఐ పెరిగింది. గతేడాది(2019) ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 3.24 శాతంగా ఉండగా, మళ్లీ ఆ స్థాయిలో పెరగడం ఇప్పుడే. ఈమేరకు కేంద్ర గణాంకాల శాఖ(ఎన్‌ఎస్‌ఒ) డేటాను విడుదల చేసింది.

దీని ప్రకారం, గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.59 శాతం, ఇది ఏడు నెలల్లో అత్యధికం. అంతకుముందు ఇది 2019 సంవత్సరం మేలో 2.79 శాతంగా ఉంది. ఇది నవంబర్‌లో 0.58 శాతమే. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి వస్తువుల ధరల పెరుగుదల టోకు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమయ్యాయి. ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 13.12 శాతానికి పెరగ్గా, ఇది నవంబర్‌లో 11 శాతంగా ఉంది. ఆహారేతర వస్తువులు గత నెలలో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఖరీదయ్యాయి. ఇది డిసెంబరులో 7.72 శాతానికి పెరగ్గా, నవంబర్‌లో 1.93 శాతంగానే ఉంది. అంతకుముందు సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వచ్చింది. ఇది డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగింది.

వరుసగా రెండవ నెలలో పెరిగింది..

గత ఏడాది(2019)లో టోకు ద్రవ్యోల్బణం చూస్తే, మే నెలలో 2.79 శాతం, జూన్ 2.02 శాతం, జూలై 1.08 శాతం, ఆగస్టు 1.17 శాతం, సెప్టెంబర్ 0.33 శాతం, అక్టోబర్ 0.16 శాతం, నవంబర్ 0.58 శాతం, డిసెంబర్ 2.59 శాతంగా ఉంది. కూరగాయల్లో బంగాళాదుంపలు 45 శాతం, పప్పుధాన్యాలు 13 శాతం పెరిగాయి.

Wholesale inflation increased

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News