Saturday, July 27, 2024

అఖిల్ కోసం యాక్షన్ మూవీని సెట్ చేసిన సమంత!

- Advertisement -
- Advertisement -

అక్కినేని అఖిల్ ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్2 బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. దీని తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ క్రమంలో అఖిల్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. తెలుగు దర్శకులు రాజ్, నిడిమోరు – కృష్ణ డీకే బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ‘డీ ఫర్ దోపిడీ’ అనే సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఈ దర్శక ద్వయం.. ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కావడం వెనుక అక్కినేని వారి కోడలు సమంత హస్తం ఉందని తెలిసింది. రాజ్, డీకే ప్రస్తుతం సామ్‌తో ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ పరిచయంతో వీరితో తన మరిది కోసం ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని సెట్ చేయించిందని టాక్ నడుస్తోంది.

Samantha sets a action film for Akhil Akkineni

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News