Monday, May 6, 2024

పునరాగమనంలో అదరగొట్టిన సానియా

- Advertisement -
- Advertisement -

Hobart doubles title

 

హోబర్ట్ డబుల్స్ టైటిల్ కైవసం

హోబర్ట్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే ఏకంగా టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో సానియా మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన నడియా కిచెనోక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా ఫైనల్లో విజయం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో సానియా జంట 64, 64తో చైనాకు చెందిన రెండో సీడ్ జాంగ్ షుపెంగ్ షు జోడీని ఓడించింది. ఆరంభం నుంచే సానియా జంట ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జోడీ నుంచి పోటీ ఎదురైనా దాన్ని తట్టుకుంటూ ఈ జోడీ ముందుకు సాగింది. ఆరంభంలో ఇరు జోడీలు కూడా నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. ఒక దశలో చైనా జంట కాస్త పైచేయి సాధించేలా కనిపించింది. కానీ, కీలక సమయంలో ఆ జోడీ ఒత్తిడికి గురైంది.

ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇండోఉక్రెయిన్ జోడీ సఫలమైంది. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా సమరం ఆసక్తిగానే కొనసాగింది. ఈసారి కూడా రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డాయి. కానీ, ఈసారి కూడా సానియా జంట ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన సానియానడియా జోడీ ఏకంగా టైటిల్‌ను గెలుచుకుని పెను ప్రకంపనలే సృష్టించింది. మరోవైపు ఆడిన తొలి టోర్నీలోనే టైటిల్ సాధించడంపై సానియా ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రదర్శన ఊహించలేదని పేర్కొంది. రానున్న ఒలింపిక్స్ నాటికి పూర్వ వైభవం సాధించడమే లక్షంగా పెట్టుకున్నట్టు సానియా వివరించింది. నడియా అందించిన ప్రోత్సాహం వల్లే తాను మెరుగ్గా ఆడగలిగానని తెలిపింది.

Sania wins Hobart doubles title
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News