Friday, January 27, 2023

మంచి చిత్రానికి దక్కిన విజయమిది

- Advertisement -

 

హైదరాబాద్: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ హీరో హీరోయిన్లుగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా శాసనసభ. ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు నిర్మించారు. వేణు మడికంటి దర్శకుడు, రవిబస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా

కథా మాటలు అందించిన రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు. శాసనసభ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందని, ఈ చిత్రంలో హీరో ఇంద్రసేనకు మంచి పేరొచ్చిందని, నారాయణ స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన ప్రధాన ఆకర్షణ అవుతోందని ప్రశంసించారు. ఆయన ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడమే సగం విజయంగా భావించామన్నారు. ఇవాళ మా నమ్మకం నిజమైందని చెప్పారు.

దర్శకుడు వేణు మడికంటి మాట్లాడారు. ఇంద్రసేనను యాక్షన్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నించానని, తాము ఆశించిన ఫలితం దక్కిందని, ఇంద్రసేన యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. చిత్రీకరణ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది అని గుర్తు చేశారు.

నటుడు భూషణ్ మాట్లాడారు. సినిమా ద్వారా మేము కోరుకునేది గుర్తింపు వచ్చిందని, ఆ గుర్తింపుతో మరికొన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామని, ఈ సినిమా ద్వారా నాకు శాసనసభ నటుడిగా పేరొచ్చిందని, ఇవాళే తాను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభించామని చెప్పారు.

హీరో ఇంద్రసేన మాట్లాడారు. మన సినిమా మనం బాగుందంటే కాదు అని, మనకు తెలిసిన వాళ్లు చెబితే కాదు బయట వాళ్లు చూసి చెప్పినప్పుడు నిజమైన సంతోషం కలుగుతుందన్నారు. ఇవాళ నాకు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేసి సినిమా చూసి బాగుందని చెప్పారన్నారు. ఇలా ప్రేక్షకుల మౌత్ టాక్ వల్ల మా చిత్రానికి వసూళ్లు పెరుగుతున్నాయని, రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించడం ఆనందంగా ఉందని, మా సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. మంచి సినిమాను ప్రేక్షకులు వదులుకోరని, తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. ఇది నా దశాబ్దాల నట జీవితంలో చూసిన అనుభవమని, ఈ చిత్రానికి విడుదలైన మూడో రోజున 60 థియేటర్స్ పెరిగాయంటే ఊరికే కాదు కదా అని చెప్పారు. సినిమా అందరికీ నచ్చితేనే థియేటర్స్ సంఖ్య పెరుగుతుందని, నారాయణ స్వామి పాత్రలో నా నటనకు పేరొచ్చిందంటే దానికి మొదటి కారణం రచయిత, తర్వాత దర్శకుడు క్రెడిట్ లో మూడో స్థానం తనదని చెప్పారు. వీళ్లు సహకరించడం వల్లే అంత బాగా నటించానని ఇంద్రసేన తనని అభిమానిస్తాడని, ఆయన కొడుకుతో ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ సినిమాను తప్పకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అనీష్ కురువిల్లా, అమిత్, దిల్ రమేష్, సినిమాటోగ్రాఫర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles