- Advertisement -
షెన్‌జెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జంట జయకేతనం ఎగుర వేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో మలేసియాకు చెందిన అరోన్ చియాసో వుయి ఇక్ జంటను ఓడించింది. దూకుడైన ఆటను కనబరిచిన సాత్విక్ జోడీ 2117, 2114తో మలేసియా జోడీని చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభం నుంచే సాత్విక్ జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనా తట్టుకుంటూ లక్షం వైపు నడిచింది. నిలకడైన ఆటతో తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో కూడా భారత జంట పూర్తి ఆధిపత్యంచెలాయించింది. ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వాన్‌సివుంగ్‌తో తలపడుతుంది.
- Advertisement -