Thursday, May 2, 2024

మూడేళ్ల ప్రయాణ నిషేధం తప్పదు

- Advertisement -
- Advertisement -
Saudi threatens 3-year travel ban for citizens
భారత్‌కు వెళ్లే పౌరులకు సౌదీ హెచ్చరిక

దుబాయ్: భారత్‌తోసహా తాము కొవిడ్-19 రెడ్ లిస్టులో చేర్చిన దేశాలకు తమ దేశ పౌరులు ఎవరైనా ప్రయాణించిన పక్షంలో మూడేళ్లపాటు ప్రయాణ నిషేధంతోపాటు భారీ జరిమానాలు ఎదుర్కోక తప్పదని సౌదీ అరేబియా హెచ్చరించింది. రెడ్ లిస్టులో చేర్చిన దేశాలకు ప్రయాణించడం కొవిడ్-19కు సంబంధించి సౌదీ అరేబియా అమలుచేస్తున్న ప్రయాణ ఆంక్షలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ ప్రెస్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. కొవిడ్-19తోపాటు వివిధ వేరియంట్లకు చెందిన కేసులు ఇటీవల పెరిగిపోతున్న నేపథ్మంలో కొన్ని దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షలను విధిస్తూ సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ఇటీవల ఆదేశాలు జారీచేసింది.

ఇలా ప్రయాణ నిషేధ ఆంక్షలు విధించిన రెడ్ లిస్టులో యుఎఇ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, ఆర్మేనియా, ఇథియోపియా, సోమాలియా, కాంగో, ఆఫ్ఘనిస్తాన్, వెనిజుల, బెలారస్, ఇండియా, వియత్నాం ఉన్నాయి. ప్రయాణ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. అలా ప్రయాణించిన వారికి మూడేళ్లపాటు ఇతర దేశాలకు వెళ్లకుండా నిషేధం విధించవచ్చని
అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి సౌదీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,20,774కు చేరుకుంది. ఇందులో 11,136 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం మరణాల సంఖ్య 8,189కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News