Friday, April 19, 2024

దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచని నేరానికి క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటున్న ఫడ్నవీస్ వీటిని రద్దుచేయాలని కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రివ్యూ పిటిషన్‌లో తాము జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదని, అందుకే దీన్ని కొట్టివేస్తున్నామని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తన ఏక వాక్య తీర్పులో పేర్కొంది. 2014 ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను ఫడ్నవీస్ పొందుపరచలేదు. ఇందుకు గాను ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టడంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ ఫడ్నవీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ఫడ్నవీస్ మహారాష్ట్ర కోర్టులో విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి అనివార్యమైంది.

SC dismisses Fadnaviss review petition 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News