Saturday, April 27, 2024

సడన్ సందర్శన

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

హైదరాబాద్ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్

జూబ్లీహిల్స్ రోడ్.నం. 45 నుంచి ఇనార్బిట్‌మాల్ వరకు కాలినడకన పర్యటన

ఫ్లైఓవర్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితంగా, నాణ్యంగా జరిపించాలని ఆదేశం

మంత్రి కెటిఆర్ ఆకస్మిక తనిఖీలు
గంటన్నర పాటు సాగిన పర్యటన
దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
కాలినడకన ఫె్లైఓవర్ పనులతో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి పనుల పరిశీలన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ర్ట పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ తనిఖీలో వివిధ విభాగాలకు చెందిన అధికారులను పరుగులు పెట్టించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు కాలినడకన ఫె్లైఓవర్ పనులతో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం అకస్మాత్తుగా రోడ్ నెంబర్ 45కు చేరుకున్న మంత్రి కెటిఆర్, ఫె్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం మీదుగా దుర్గం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తంగా రోడ్ నెంబర్ 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు కాలి నడకన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇస్తూ గంటన్నర పాటు కెటిఆర్ తనిఖీలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు దుర్గంచెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనుల పురోగతిని అక్కడ పనిచేస్తున్న వర్కింగ్ ఏజెన్సీ, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ట్రాన్స్‌కో విద్యుత్ లైన్ల తరలింపు, నూతన విద్యుత్ టవర్ల నిర్మాణం వంటి పెండింగ్ పనుల గురించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. రెండు వారాల్లోగా ఫె్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు విద్యుత్ లైన్లను తరలిస్తామని విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సికి చెందిన ఎల్‌అండ్‌టి ఇంజనీర్లతో పనుల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయినట్లు ఎల్ అండ్ టి ఇంజనీర్లు తెలిపారు.

నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నందున సుందరీకరణ, లైటింగ్, పాదచారుల బాటల ఏర్పాటు పనులను మొదలుపెట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఆయన సూచించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత దానికి అనుసంధానంగా రోడ్ నెం. -45 వరకు చేపట్టిన రోడ్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీని, అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పూర్తి అయితే పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు అరికెపూడి గాంధీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

అనంతరం హైటెక్ సిటీలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించాల్సిందిగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ లను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈమేరకు హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ వద్దకు చేరుకున్న మేయర్ బృందం అక్కడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు ఈ బ్రిడ్జితో లబ్ది కలుగుతుందని పేర్కొన్నారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు మేయర్ తెలిపారు. తదనంతరం ఈ పనులు వివరాలను ఆయన మంత్రి కెటిఆర్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు.

Minister KTR contingency checks in hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News