Thursday, May 2, 2024

విదేశాలకు వెళ్లే ఓయూ విద్యార్థులకు ఉపకార వేతనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాలిఫికేషన్ ఉపకార వేతనాలను ఇవ్వనున్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరమ్ ఛైర్మన్, తెలంగాణ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. గురువారం ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో జీఈసీఎఫ్ పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విదేశాల్లో చదువుల కోసం సిద్దమవుతున్న 500 మంది విద్యార్థులకు సంస్థ తరఫున స్కాలర్ షిప్ లు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయి విద్య మాత్రమే కాకుండా గ్లోబల్ కెరీర్ కోసం విద్యార్థులను జీఈసీఎఫ్ ప్రోత్సహిస్తుందని నవీన్ మిట్టల్ అన్నారు.

జపాన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ లోనే సగటు యువజనాభా వయస్సు 27 సంవత్సరాలుగా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ అవకాశాలను పొందే శక్తి కేవలం మనకే ఉందని గుర్తు చేశారు. గతేడాది సంస్థ నుంచి 150 మందికి ఉపకారవేతనాలు అందించామని ఈ ఏఢాది 1500 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చాఫ్టర్ ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ విద్యా సంస్థలు, విద్యార్థులు జీఈసీఎఫ్ తో అనుసంధానం కావటం ద్వారా విదేశీ విద్యపై ప్రామాణికమైన సమాచారాన్ని పొందవచ్చని వివరించారు. విదేశీ విద్య, కెరీర్ కోసం భాషా నైపుణ్యాలు చాలా కీలకమన్న ఆయన పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు జీఈసీఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు.
ఉస్మానియా యూనివర్శిటీ వ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్, కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, జీఈసీఎఫ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓయూ హెచ్.సి.డి.సి డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, ఓయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగేశ్, జీఈసీఎఫ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ పొల్గొన్నారు. దాదాపు 80 వరకు ఓయూ అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News