Thursday, May 2, 2024

11న లక్ష మందితో సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, సింగరేణి తదితర ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ,రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల అస్థవ్యస్తంపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ నెల 11 న లక్ష మందితో సిపిఐ పార్టీ ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం పట్టణంలోని తాటిపల్లి రెసిడెన్సిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి పార్టీ అనుసరిస్తున్న మతోన్మాద వైఖరి, ప్రభుత్వరంగ సంస్థల విక్రయం, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుండడంపై సభకు వచ్చిన ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కర్ణాటక ఫలితాలతో విలవిలలాడుతుందని ఈ మార్పు వెనుక కమ్యునిస్టుల పాత్ర ఉందని స్పష్టం చేశారు. వల్లభాయ్ పటేల్, భగత్‌సింగ్ లాంటి దేశ భక్తులకు మతం రంగు పులుముతూ దేశంలో విచ్చిన్నకర పరిస్థితులకు బాటలు వేస్తుందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సభకు అఖిల భారత ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రజా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ వంటి అగ్రనేతలు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌పాషా, సీనియర్ నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, సలిగంటి శ్రీనివాస్, వై.శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News