Monday, April 29, 2024

ఎడతెరిపి లేని వర్షాలు

- Advertisement -
- Advertisement -

జూలూరుపాడు : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జూలూరుపాడు మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. పాఠశాలల ఆవరణలు సైతం నీటితో నిండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తి చేలలో నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సూరారంలోని ఎర్ర వాగు, పడమటి నరసాపురం, బేతాళ పాడు మధ్యగల తుమ్మల వాగు, అన్నారు పాడు గుండ్లరేవు మధ్యగల చెప్ట్టా, కరి వారి గూడెం పెద్ద పెద్ద వాగు పొంగి ప్రవహిస్తున్నడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

కాకర్ల, పడమటి నరసాపురం, జూలూరుపాడు తదితర పాఠశాలలో నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పడమటి నర్సాపురం లోని ప్రధాన రహదారి జలమయంగా మారిపోయింది. కొన్ని గ్రామాలలో వీళ్ళని జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News