Tuesday, May 14, 2024

విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్య మార్గదర్శకం

- Advertisement -
- Advertisement -

School Education

 

హైదరాబాద్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల విద్య మార్గదర్శకత్వం వహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య పేర్కొన్నారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాహార్ హైస్కూల్ వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తును అన్ని రకాలుగా తీర్చిదిద్దడంలో పాఠశాలలు చక్కని దిక్సూచిగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ఉపాధ్యాయులు బోధించే సుగుణాలను ఆచరించి, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొవాలని సూచించారు. విద్యార్థులను తీర్చిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటు పడాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య అధ్యక్షత వహించారు. 197374 నాటి పాఠశాల డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా విడుదల చేశారు.ఈ సందర్భంగా దక్షిణ మధ్య మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయంతి మాల్య మాట్లాడుతూ ఈ పాఠశాలలో రైల్వే ఉద్యోగుల పిల్లలకే కాకుండా ఇతర బాల బాలికలకు కూడా విద్యను అందిస్తామన్నారు. విద్యార్థుల ప్రతిభ పాటవాలను వెలికి తీయడంలో వార్షికోత్సవం క్రీయాశీలంగా ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలల్లో గెలుపొందిన విజేతలకు జిఎం బహుమతులను పంపిణి చేశారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మెమెంటోలను అందజేశారు. ఈ వార్షికోత్సవంలో విద్యావిహార్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఫణికూమారి పాఠశాల ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ వార్షికోత్సవం కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మినాల్ ఫడ్కే, కోశాధికారి ఉషాజైన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.

School Education guide to future of Students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News