Monday, April 29, 2024

విఎల్‌టితో… క్యాబ్‌లలో ప్రయాణానికి భరోసా

- Advertisement -
- Advertisement -

VLT

 

హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా మహిళల పట్ల కొందరు డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటలకు సంబంధించి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కొందరు మహిళలు ధైర్యం చేసిన సదరు డ్రైవర్‌ను అక్కడిక్కడే తిట్టేసి కారు దిగి వెళ్ళిపోతున్నారు. కొత్తగా ప్రయాణించూ వారైతే మరింత భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టే కార్యక్రమంలో భాంగా కేంద్ర ప్రభుత్వం వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (విఎల్‌టి)ని తీసుకు వచ్చింది. ఇది నగరంలో ప్రయాణిం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో విఎల్‌టి తప్పని సరిగా ఉండాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతీక్యాబ్‌లో లేదా ప్రజారవాణ వాహనంలో కేంద్ర ఉత్తర్వులు ప్రకారం ప్రతిక్యాబ్ లేదా ప్రజారవాణా వాహనంలో ఈ వీఎల్‌టి పరికరం ఏర్పాటు చేసుకోవాలి. ఇది సమీపంలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి. ఏక్కడ … ఏ వాహనం ఉందో.. అది ఎటువైపు ప్రయాణిస్తోందో ఎప్పటికిప్పుడు పరిశీలించే అవకాశం ఉండటమే కాకుందా వీటిని రవాణాశాఖ, పోలీసు విభాగాలకు అనుసంధానం చేస్తారు.

కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ రిజిస్ట్రర్‌లో ఆయా వాహనాల డేటాబేస్‌కు కూడా అనుసంధానమై ఉంటాయి.క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సందర్భంలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినా లేదా ఏవైన ప్రమాదకర సంఘటలను ఎదురైనప్పుడు వాహనాల్లో ఏర్పాటు చేసిన అత్యవసర మీట నొక్కితే సమీప కంట్రోల్ రూం కేంద్రాలకు అటు నుంచి పోలీస్టేషన్లకు సమాచారం క్షణాల్లో తెలుస్తుంది. దీంతో సదరు వాహనాన్ని ట్రాక్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటారు. ఒక వేళ మితిమీరి వేగంతో ప్రయాణించినా వాహన డేటాబేస్‌కు సమాచారం అందుతుంది. నగరంలో రోజుకు కొన్ని లక్షల మంది అందుబాటులో ఉన్న రవాణాసౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఆర్టిసి బస్సులోనే ప్రతి రోజు 33 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇక నగరంలో ఉన్న క్యాబ్‌లలో సుమారు 50 నుంచి 60 వేల మంది రాక పోకలు సాగిస్తుంటారు.

విఎల్‌టి ఏర్పాటుతో ప్రయాణికులకు మరింత భద్రత కలుగుతుంది. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 70 నుంచి 80వేల క్యాబ్‌లు,1.30 లక్షల ఆటోలు,70 నుంచి 80 వేల వరకు ఆటోలు తిరుగుతున్నాయి.ప్రధానంగా ఐటీ కారిడార్,విమనాశ్రయం, రైల్వేస్టేషన్ వద్ద క్యాబ్‌లను ఎక్కువగా వినియోగిస్తన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే గతంలో అధిక శాతం ఆటోలను ఆశ్రయించే వారు. కానీ నగరంలో రోజు రోజుకు పెరుడుతున్న వాహన రద్దీతో ట్రాఫిక్ సమస్యలు,పొల్యుషన్ వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు క్యాబ్‌లపై దృష్టి సారిస్తున్నారు.వీటిని నిర్వహించే సంస్థలు కూడా ప్రయాణికులకు భధ్రతకు ప్రాధాన్యం ఇస్తుండటంతో అన్ని వర్గాల వారు వీటిపై మొగ్గు చూపుతున్నారు.అయితే కొంత మంది క్యాబ్ డ్రైవర్ల నిర్వాకం కారణంగా ఆయాన సంస్థలకు చెడ్డ పేరు వస్తోంది. ఇటువంటి వాటిని అడ్డుకునేందుకు విఎల్‌టి ఎంతో ఉపయోగపడతుంది.

Secure travel in cab with VLT
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News