Friday, April 19, 2024

సమ్మర్ స్పెషల్‌గా…

- Advertisement -
- Advertisement -

Seeti Maar

 

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సీటీమార్’. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “ఇటీవల హైదరాబాద్, రాజమండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని సోమవారం నుండి ఆర్.ఎఫ్.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా షెడ్యూల్ జరిపి సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపీచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం”అని అన్నారు. భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్ రాజన్, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్ కుమార్.

Seeti Maar movie first look poster release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News