Saturday, May 4, 2024

పాఠశాలకూ సెమిస్టర్

- Advertisement -
- Advertisement -

School Education

 

ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి జాతీయ విధాన నివేదిక సూచన
8వ తరగతి తర్వాత డ్రాప్‌అవుట్లు అధికం, మూస పద్ధ్దతి బోధనకు స్వస్తి
చెప్పాలి, నాణ్యత లేని బిఇడి కళాశాలలను మూసి వేయాలి

హైదరాబాద్ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యావిధానం నివేదిక సూచించింది. పాఠశాల, ఉన్నతవిద్య ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను నివేదిక పేర్కొంది. ప్రీ ప్రైమరీలో నాణ్యత ఉండటం లేదని, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది.

చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 2035 నాటికి 100 శాతం ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి 6 నుంచి -8 తరగతుల్లో 90.7 శాతం, 9, -10 తరగతుల్లో 79.3 శాతం, 11, -12 తరగతుల్లో 51.3 శాతం ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం ఎనిమిదవ తరగతి తర్వాత బడి మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ప్రీ ప్రైమరీ విద్యలో 2035 నాటికి 100 శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలని నివేదికలో స్పష్టం చేశారు.

పాఠశాల విద్యకు కొత్త సిలబస్
విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, శాస్త్రీయ స్వభావం, సహకారం, బహుభాషావాదం, సమస్య పరిష్కారం, సామాజిక బాధ్యత, డిజిటల్ అక్షరాస్యత వంటి సమగ్ర అభివృద్దిని ప్రోత్సహించాలని సూచించింది. మూస పద్దతిలో బోధినను తగ్గించి 21వ శతాబ్దపు నూతన నైపుణ్యాలను ప్రోత్సహించాలని పేర్కొంది. పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక, బోధనా నిర్మాణం వివిధ దశలలో వారి అభివృద్ది పరమైన అవసరాలకు ప్రతిస్పందనగానూ, సంబంధంగానూ అభ్యాసకుల అభిరుచులకు అనుగుణంగా పునర్నిర్మించబడుతుందని స్పష్టం చేసింది.

పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం
పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలని, ఐదేళ్లలో మొదటి మూడేళ్లు ప్రీ ప్రైమరీతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3 నుంచి -5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6- నుంచి 8 తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9- నుంచి 12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత,పరస్పర సహకార విధానం బోధించాలి.

ఆర్థిక సమస్యలతో ఎవరూ ఉన్నత విద్యకు దూరం కావొద్దు
అర్థిక సమస్యలతో ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని పేర్కొంది. జాతీయ ఉపకార వేతనాన్ని మరింత విస్తరించాలని తెలిపింది. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఉపకార వేతనాలను అందించాలని, ఉన్నత విద్యలో ప్రవేశాల నిష్ఫత్తి 2018లో జాతీయ సరాసరి 26.3 శాతం, ఉందని, దానిని 2030 నాటికి 50 శాతానికి పెంచాలని సూచించింది. 2040 నాటికి డిగ్రీ కళాశాలలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా, విశ్వవిద్యాలయాలు, పరిశోధన వర్సిఒటీలు, బోధన వర్సిటీలు మారాలని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థలు నాలుగేళ్ల డిగ్రీలను ఆహ్వానించాలని సూసచించింది. విద్యార్థులు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. మొది ఏడాది వెళ్లిపోతే డిప్లొమా అర్హత ధృవపత్రం, మూడేళ్లకు బయటకు వెళ్తే డిగ్రీ ఇవ్వాలని వెల్లడించింది.

నాణ్యతలేని బి.ఇడి కళాశాలల మూత
ఉపాధ్యాయ విద్యలఅఓ నాణ్యత పెరగాలని, నాణ్యతలేని కళాశాలలను వీలైనంతవరకు మూసివేయాలని నివేదిక సూచించింది. కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, ఉపాధ్యాయ నిష్పత్తి 30:1, సామాజికంగా వెనుకడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. 2030 నాటికి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ- బి.ఇడి కోర్సు అర్హతగా ఉండాలని సూచించింది. విద్యాసంస్థలు బహుళ బి.ఇడి కోర్సులను నిర్వహించాలని, నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలని తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ, అంచనా, అక్రిడియేషన్ అవసరమని పేర్కొంది. వెనుకబడిన, అగణానికి వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని పేర్కొంది. జాతీయ ఒపెన స్కూల్‌లో సారత్రిక, దూర విద్య కోర్సులను మరింత పెంచాలని సూచించింది.

Semester Policy in School Education
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News